1
కీర్తనల గ్రంథము 139:14
పవిత్ర బైబిల్
యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
Compare
Explore కీర్తనల గ్రంథము 139:14
2
కీర్తనల గ్రంథము 139:23-24
యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము. చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
Explore కీర్తనల గ్రంథము 139:23-24
3
కీర్తనల గ్రంథము 139:13
యెహోవా, నా శరీరమంతటినీ నీవు చేశావు. నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
Explore కీర్తనల గ్రంథము 139:13
4
కీర్తనల గ్రంథము 139:16
యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
Explore కీర్తనల గ్రంథము 139:16
5
కీర్తనల గ్రంథము 139:1
యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
Explore కీర్తనల గ్రంథము 139:1
6
కీర్తనల గ్రంథము 139:7
నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
Explore కీర్తనల గ్రంథము 139:7
7
కీర్తనల గ్రంథము 139:2
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
Explore కీర్తనల గ్రంథము 139:2
8
కీర్తనల గ్రంథము 139:4
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
Explore కీర్తనల గ్రంథము 139:4
9
కీర్తనల గ్రంథము 139:3
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
Explore కీర్తనల గ్రంథము 139:3
Home
Bible
Plans
Videos