1
1 యోహాను 3:18
తెలుగు సమకాలీన అనువాదము
ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.
Compare
Explore 1 యోహాను 3:18
2
1 యోహాను 3:16
ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కనుక దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కొరకు మన ప్రాణాలను పెట్టవలసిన వారిగా ఉన్నాము.
Explore 1 యోహాను 3:16
3
1 యోహాను 3:1
మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు.
Explore 1 యోహాను 3:1
4
1 యోహాను 3:8
సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కనుక పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు.
Explore 1 యోహాను 3:8
5
1 యోహాను 3:9
దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కనుక వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కనుక పాపం చేయలేరు.
Explore 1 యోహాను 3:9
6
1 యోహాను 3:17
ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరునికి లేదా సహోదరికి చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
Explore 1 యోహాను 3:17
7
1 యోహాను 3:24
దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నాడని మనకు తెలుస్తుంది.
Explore 1 యోహాను 3:24
8
1 యోహాను 3:10
దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని లేక సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు.
Explore 1 యోహాను 3:10
9
1 యోహాను 3:11
మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి
Explore 1 యోహాను 3:11
10
1 యోహాను 3:13
నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి.
Explore 1 యోహాను 3:13
Home
Bible
Plans
Videos