1
1 పేతురు 4:8
తెలుగు సమకాలీన అనువాదము
అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.
Compare
Explore 1 పేతురు 4:8
2
1 పేతురు 4:10
అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు, దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకొరకు ఉపయోగించాలి.
Explore 1 పేతురు 4:10
3
1 పేతురు 4:11
ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవచేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి, అప్పుడు మనం అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక. ఆమేన్.
Explore 1 పేతురు 4:11
4
1 పేతురు 4:16
అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడినా సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవుణ్ణి స్తుతించండి.
Explore 1 పేతురు 4:16
5
1 పేతురు 4:7
అన్నిటికి అంతం సమీపించింది, కనుక మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.
Explore 1 పేతురు 4:7
6
1 పేతురు 4:12-13
ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీపై వచ్చిన మండుతున్న అగ్నిపరీక్షను చూసి, మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి. పైగా క్రీస్తు బాధలలో పాలుపొందామని ఆనందించండి, దానివల్ల ఆయన మహిమ ప్రదర్శింపబడిన దినాన మీరు మహానందాన్ని అనుభవిస్తారు.
Explore 1 పేతురు 4:12-13
7
1 పేతురు 4:9
సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి.
Explore 1 పేతురు 4:9
8
1 పేతురు 4:19
కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.
Explore 1 పేతురు 4:19
9
1 పేతురు 4:1-2
కాబట్టి క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, గనుక మీరు అలాంటి వైఖరిని ఆయుధంగా ధరించుకోండి, ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు. కనుక ఇప్పటి నుండి, మీ ఇహలోక జీవితాలను దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా కొనసాగించండి. ఈ లోక మానవ దురాశలను అనుసరించకండి.
Explore 1 పేతురు 4:1-2
10
1 పేతురు 4:14
క్రీస్తు నామం కొరకు మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, ఆ మహిమ గల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావం.
Explore 1 పేతురు 4:14
Home
Bible
Plans
Videos