1
2 తిమోతికి 4:7
తెలుగు సమకాలీన అనువాదము
నేను మంచి పోరాటం పోరాడి, విశ్వాసాన్ని కాపాడుకొని, నా పరుగు పందాన్ని ముగించాను.
Compare
Explore 2 తిమోతికి 4:7
2
2 తిమోతికి 4:2
వాక్యాన్ని ఆతురతతో అనువైన సమయంలో అనువుకాని సమయంలో ప్రతి సమయంలో సిద్ధపాటు కలిగి, ఎంతో సహనంతో, సరియైన సూచనలతో ప్రజలను సరిదిద్దుతూ, గద్దిస్తూ, ప్రోత్సాహిస్తూ బోధించు.
Explore 2 తిమోతికి 4:2
3
2 తిమోతికి 4:3-4
ఎందుకంటే, ప్రజలు మంచిబోధను అంగీకరించని ఒక సమయం వస్తుంది. అప్పుడు వారు తమ సొంత ఆశలకు అనుగుణంగా తమ దురద చెవులు వినడానికి ఇష్టపడే వాటినే బోధించే అనేకమంది బోధకులను తమ చుట్టూ చేర్చుకుంటారు. వారు సత్యం నుండి తొలగిపోయి కట్టుకథలు వినడానికి తమ చెవులను అప్పగిస్తారు.
Explore 2 తిమోతికి 4:3-4
4
2 తిమోతికి 4:5
కాని నీవైతే అన్ని పరిస్థితులలో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పనిచేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.
Explore 2 తిమోతికి 4:5
5
2 తిమోతికి 4:8
కనుక నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కొరకు దాచబడివుంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.
Explore 2 తిమోతికి 4:8
Home
Bible
Plans
Videos