1
కొలొస్సీ పత్రిక 2:6-7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి, మీరు క్రీస్తు యేసును ప్రభువుగా అంగీకరించినట్టుగా, ఆయనలో వేరుపారి బలపడుతూ, మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.
Compare
Explore కొలొస్సీ పత్రిక 2:6-7
2
కొలొస్సీ పత్రిక 2:8
క్రీస్తుపై కాకుండా, మానవ ఆచార సాంప్రదాయాలు ఈ లోకసంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తపడండి.
Explore కొలొస్సీ పత్రిక 2:8
3
కొలొస్సీ పత్రిక 2:13-14
మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చచ్చినవారిగా ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు, మనకు వ్యతిరేకంగా ఉండి, మనల్ని శిక్షకు గురి చేసే రుణపత్రాన్ని రద్దుచేశారు; ఆయన దానిని తీసివేసి, దానిని సిలువకు మేకులతో కొట్టారు.
Explore కొలొస్సీ పత్రిక 2:13-14
4
కొలొస్సీ పత్రిక 2:9-10
ఎందుకంటే, పరిపూర్ణ దైవత్వం శరీర రూపంలో క్రీస్తులో జీవిస్తుంది. మీరు క్రీస్తులో పరిపూర్ణతలోనికి తీసుకురాబడ్డారు. సమస్త బలానికి అధికారానికి ఆయనే శిరస్సు.
Explore కొలొస్సీ పత్రిక 2:9-10
5
కొలొస్సీ పత్రిక 2:16-17
కాబట్టి, మీరు తిని త్రాగే వాటి గురించి గాని, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, సబ్బాతు దిన ఆచారాల గురించి గాని మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి. ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది.
Explore కొలొస్సీ పత్రిక 2:16-17
Home
Bible
Plans
Videos