1
ప్రకటన 21:4
తెలుగు సమకాలీన అనువాదము
‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తాడు. పాత క్రమం గతించిపోయింది కనుక అక్కడ చావు ఉండదు, దుఃఖం కాని ఏడ్పు కాని బాధ కాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను.
Compare
Explore ప్రకటన 21:4
2
ప్రకటన 21:5
అప్పుడు సింహాసనం మీద కూర్చునివున్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కనుక వీటిని వ్రాసి పెట్టు” అన్నాడు.
Explore ప్రకటన 21:5
3
ప్రకటన 21:3
అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తాడు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటాడు.
Explore ప్రకటన 21:3
4
ప్రకటన 21:6
ఆయన నాతో, “సమాప్తమైనది. ఆల్ఫా, ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
Explore ప్రకటన 21:6
5
ప్రకటన 21:7
జయించువారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు.
Explore ప్రకటన 21:7
6
ప్రకటన 21:8
అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు.
Explore ప్రకటన 21:8
7
ప్రకటన 21:1
అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని” చూసాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది.
Explore ప్రకటన 21:1
8
ప్రకటన 21:2
అప్పుడు తన భర్త కొరకు అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూసాను.
Explore ప్రకటన 21:2
9
ప్రకటన 21:23-24
ఆ పట్టణంపై సూర్యుడు కాని చంద్రుడు కాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపం. ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు.
Explore ప్రకటన 21:23-24
Home
Bible
Plans
Videos