1
ప్రకటన 3:20
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో నేను, నాతో వారు భోజనం చేస్తాము.
Compare
Explore ప్రకటన 3:20
2
ప్రకటన 3:15-16
నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేవు. నీవు చల్లగా కాని వెచ్చగా కాని ఉంటే మంచిది. నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేకుండా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను.
Explore ప్రకటన 3:15-16
3
ప్రకటన 3:19
నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు.
Explore ప్రకటన 3:19
4
ప్రకటన 3:8
నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు.
Explore ప్రకటన 3:8
5
ప్రకటన 3:21
నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను.
Explore ప్రకటన 3:21
6
ప్రకటన 3:17
నీవు, ‘నేను ధనవంతున్ని నేను చాలా ఆస్తులను సమకూర్చుకొన్నాను కాబట్టి నాకు ఏ లోటులేదని’ అంటున్నావు కాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, బీదవాడవు, గ్రుడ్డివాడివి, దిగంబరివని నీకు తెలియదు.
Explore ప్రకటన 3:17
7
ప్రకటన 3:10
నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కాబట్టి భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న శోధన సమయంలో నేను నిన్ను కాపాడతాను.
Explore ప్రకటన 3:10
8
ప్రకటన 3:11
నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.
Explore ప్రకటన 3:11
9
ప్రకటన 3:2
మేల్కో! నా దేవుని దృష్టిలో నీ క్రియలు సంపూర్తి అయినట్లు నాకు కనిపించలేదు కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు.
Explore ప్రకటన 3:2
Home
Bible
Plans
Videos