1
రోమా పత్రిక 12:2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.
Compare
Explore రోమా పత్రిక 12:2
2
రోమా పత్రిక 12:1
కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.
Explore రోమా పత్రిక 12:1
3
రోమా పత్రిక 12:12
నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.
Explore రోమా పత్రిక 12:12
4
రోమా పత్రిక 12:21
చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.
Explore రోమా పత్రిక 12:21
5
రోమా పత్రిక 12:10
ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి.
Explore రోమా పత్రిక 12:10
6
రోమా పత్రిక 12:9
ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి.
Explore రోమా పత్రిక 12:9
7
రోమా పత్రిక 12:18
మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి.
Explore రోమా పత్రిక 12:18
8
రోమా పత్రిక 12:19
నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి.
Explore రోమా పత్రిక 12:19
9
రోమా పత్రిక 12:11
అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి.
Explore రోమా పత్రిక 12:11
10
రోమా పత్రిక 12:3
నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.
Explore రోమా పత్రిక 12:3
11
రోమా పత్రిక 12:17
చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి.
Explore రోమా పత్రిక 12:17
12
రోమా పత్రిక 12:16
ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు.
Explore రోమా పత్రిక 12:16
13
రోమా పత్రిక 12:20
అయితే, “మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి; అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి. మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు.”
Explore రోమా పత్రిక 12:20
14
రోమా పత్రిక 12:14-15
మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.
Explore రోమా పత్రిక 12:14-15
15
రోమా పత్రిక 12:13
అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి.
Explore రోమా పత్రిక 12:13
16
రోమా పత్రిక 12:4-5
ఎలాగైతే మనకు ఉన్న ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నా అవన్నీ ఒకే పని ఎలా చేయవో, అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే.
Explore రోమా పత్రిక 12:4-5
Home
Bible
Plans
Videos