1
యోహాను 6:35
తెలుగు సమకాలీన అనువాదము
అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.
Compare
Explore యోహాను 6:35
2
యోహాను 6:63
ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో పలికిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.
Explore యోహాను 6:63
3
యోహాను 6:27
మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.
Explore యోహాను 6:27
4
యోహాను 6:40
కుమారుని వైపు చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందుకోవాలని, వారిని చివరి రోజున జీవంతో నేను లేపాలని నా తండ్రి చిత్తమై ఉంది.”
Explore యోహాను 6:40
5
యోహాను 6:29
అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
Explore యోహాను 6:29
6
యోహాను 6:37
తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను.
Explore యోహాను 6:37
7
యోహాను 6:68
అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీవే కలిగివున్నావు.
Explore యోహాను 6:68
8
యోహాను 6:51
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవరైనా ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.
Explore యోహాను 6:51
9
యోహాను 6:44
ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను.
Explore యోహాను 6:44
10
యోహాను 6:33
ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుని యొక్క ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
Explore యోహాను 6:33
11
యోహాను 6:48
జీవాహారం నేనే.
Explore యోహాను 6:48
12
యోహాను 6:11-12
అప్పుడు యేసు రొట్టెలను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు. వారందరూ సరిపడినంత తిన్న తర్వాత, ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు.
Explore యోహాను 6:11-12
13
యోహాను 6:19-20
వారు సుమారు మూడు, నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, యేసు నీటి మీద నడస్తూ పడవ దగ్గరకు రావడం చూసి, వారు భయపడ్డారు. అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు.
Explore యోహాను 6:19-20
Home
Bible
Plans
Videos