1 పేతురు 3
3
1అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; 2అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యములేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును. 3జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 4సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము#3:4 మూలభాషలో–అంతరంగపురుషుడు. మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవునిదృష్టికి మిగుల విలువగలది. 5అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. 6ఆప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు,#3:6 లేక, మేలుచేయుచు. ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
7అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
8తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. 9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
10–జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు
వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను,
కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను
కాచుకొనవలెను.
11అతడు కీడునుండి తొలగి
మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని
వెంటాడవలెను.#3:11 మూలభాషలో–అనుసరింపవలెను.
12 ప్రభువు కన్నులు నీతిమంతుల
మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను
ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది.
13మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు? 14మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి; 15-16నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు. 17దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది. 18ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను. 19-20దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి. 21దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. 22ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
Currently Selected:
1 పేతురు 3: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: