2 కొరింథీయులకు 2
2
1మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని. 2నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? 3నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని. 4మీకు దుఃఖము కలుగ వలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
5ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను. 6అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును 7గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. 8కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 9మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని. 10మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. 11నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.
12క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా#2:12 మూలభాషలో–ద్వారము తెరువబడియుండగా. సహోదరుడైన తీతు నాకు కనబడనందున 13నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని. 14మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునుగూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 15రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. 16నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. 17కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము.
Currently Selected:
2 కొరింథీయులకు 2: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: