న్యాయాధిపతులు 21
21
1ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను . బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి. 2ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలమువరకు కూర్చుండి 3–యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేల అని బహుగా ఏడ్చిరి. 4మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి. 5అప్పుడు ఇశ్రాయేలీయులు – ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. 6ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడి–నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో నుండకుండ కొట్టివేయబడియున్నది; 7మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమిగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి. 8మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా 9సమాజమునకుచేరిన యాబేష్గిలాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. 10కాబట్టి సమాజపువారు పరాక్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి –మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి. 11మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. 12యాబేష్గిలాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొని వచ్చిరి.
13ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా 14ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్ర్రీలు వారికి చాలకపోగా 15యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి.
16సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలినవారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకొని 17ఇశ్రాయేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి. 18ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చినయెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి. 19కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి–ఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణదిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి 20–మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా 21ద్రాక్షతోటలలోనుండి బయలుదేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. 22తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము –ఆ యుద్ధమునుబట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి. 23కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోనుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసికొనిపోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. 24అటుపిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడనుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడనుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. 25ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.
Currently Selected:
న్యాయాధిపతులు 21: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: