YouVersion Logo
Search Icon

యోబు 42

42
1అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు
త్తరమిచ్చెను–
2నీవు సమస్తక్రియలను చేయగలవనియు
నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు
నేనిప్పుడు తెలిసికొంటిని.
3జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు?
ఆలాగున వివేచనలేనివాడనైన నేను
ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను
గూర్చి మాటలాడితిని.
4నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట
ఆలకింపుము
ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ
జెప్పుము.
5వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని
అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు
చున్నాను.
6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను
బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
7యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను–
నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి
యుక్తమైనది పలుకలేదు గనుక
నాకోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను
మండుచున్నది.
8కాబట్టి యేడుఎడ్లను ఏడుపొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
9తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవావారిపక్షమున యోబును అంగీకరించెను.
10మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
11అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైనవారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను#42:11 కొంతసొమ్మును. ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.
12యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగు వేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.
13మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.
14అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.
15ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
16అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.

Currently Selected:

యోబు 42: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in