విలాపవాక్యములు 3
3
1నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన
నరుడను.
2ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి
దానిలో నన్ను నడిపించుచున్నాడు.
3మాటి మాటికి దినమెల్ల
ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
4ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప
జేయుచున్నాడు.
నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
5నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు
విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి
యున్నాడు
6పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు
ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి
యున్నాడు
7ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు
నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు
వేసియున్నాడు
8నేను బతిమాలి మొరలిడినను
నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని
యున్నాడు.
9ఆయన నా మార్గములకు అడ్డముగా
చెక్కుడురాళ్లు కట్టియున్నాడు
నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి
యున్నాడు
10నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి
వలె ఉన్నాడు
చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు
11నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి
యున్నాడు
నాకు దిక్కులేకుండ చేసియున్నాడు
12విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా
ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు
13తన అంబులపొదిలోని బాణములన్నియు
ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.
14నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను
దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ
నైతిని.
15చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను
మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
16రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను
బుగ్గిలో నన్ను పొర్లించెను.
17నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి
యున్నాడు
మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
18నాకు బలము ఉడిగెను అనుకొంటిని
యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
19నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి
పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
20ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో
క్రుంగియున్నది
అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
21నేను దీని జ్ఞాపకము చేసికొనగా
నాకు ఆశ పుట్టుచున్నది.
22యెహోవా కృపగలవాడు
ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక
మనము నిర్మూలము కాకున్నవారము.
23అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది
నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
24యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను
ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
25తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా
ళుడు
తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
26నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ
కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
27యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
28అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే.
గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ
వలెను.
29నిరీక్షణాధారము కలుగునేమో యని
అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
30అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప
వలెను.
అతడు నిందతో నింపబడవలెను
31ప్రభువు సర్వకాలము విడనాడడు.
32ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి
పడును.
33హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము
నైనను బాధనైనను కలుగజేయడు.
34దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద
త్రొక్కుటయు
35మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల
గించుటయు
36ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు
ప్రభువు మెచ్చుకార్యములు కావు.
37ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా
డెవడు?
38మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును
బయలు వెళ్లునుగదా?
39సజీవులేల మూల్గుదురు?
నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
40మన మార్గములను పరిశోధించి తెలిసికొని
మనము యెహోవాతట్టు తిరుగుదము.
41ఆకాశమందున్న దేవునితట్టు
మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
42మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము
నీవు మమ్మును క్షమింపలేదు.
43కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము
చున్నావు
దయ తలచక మమ్మును చంపుచున్నావు.
44మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత
నిన్ను కప్పుకొనియున్నావు.
45జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి
యున్నావు.
46మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి
చేసెదరు.
47భయమును గుంటయు పాడును నాశనమును మాకు
తటస్థించినవి.
48నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా
కన్నీరు ఏరులై పారుచున్నది.
49యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు
వరకు
50నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
51నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు
నేను దుఃఖాక్రాంతుడనైతిని.
52ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా
నన్ను వెనువెంట తరుముదురు.
53వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి
నాపైన రాయి యుంచిరి
54నీళ్లు నా తలమీదుగా పారెను
నాశనమైతినని నేననుకొంటిని.
55యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి
నేను నీ నామమునుబట్టి మొరలిడగా
56నీవు నా శబ్దము ఆలకించితివి
సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా
చెవిని మూసికొనకుము.
57నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు
వచ్చితివి
–భయపడకుమి అని నీవు చెప్పితివి.
58ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము
లను వాదించితివి
నా జీవమును విమోచించితివి.
59యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి
యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
60పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన
లన్నియు నీవెరుగుదువు.
61యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని
62నామీదికి లేచినవారు పలుకు మాటలును
దినమెల్ల వారు నామీదచేయు ఆలోచనయు నీవు
వినియున్నావు.
63వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని
పెట్టుము
నేను వారి పాటలకు ఆస్పదమైతిని.
64యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ
కారము చేయుదువు.
65వారికి హృదయకాఠిన్యము నిత్తువువారిని శపించుదువు.
66నీవు కోపావేశుడవై వారిని తరిమి
యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ
Currently Selected:
విలాపవాక్యములు 3: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: