సామెతలు 14
14
1జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును
మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ
బెరుకును.
2యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు
భయభక్తులుగలవాడు
కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు,
3మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది.
జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.
4ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు
ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును
5నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు
కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.
6అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము.
తెలివిగలవానికి జ్ఞానము సులభము.
7బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము
జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?
8తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము
మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
9మూఢులుచేయు అపరాధపరిహారార్థబలి వారిని
అపహాస్యము చేయును
యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.
10ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును
ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు.
11భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును
యథార్థవంతుల గుడారము వర్ధిల్లును.
12ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము
కలదు
అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
13ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ
వచ్చును.
సంతోషము తుదకు వ్యసనమగును.
14భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును
మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.
15జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును
వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
16జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును
బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
17త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును.
దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.
18జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము
వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.
19చెడ్డవారు మంచివారి యెదుటను
భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.
20దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు
ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.
21తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు
బీదలను కటాక్షించువాడు ధన్యుడు.
22కీడు కల్పించువారు తప్పిపోవుదురు
మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.
23ఏ కష్టము చేసినను లాభమే కలుగును
వట్టిమాటలు లేమిడికి కారణములు.
24జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము
బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.
25నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును
అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.
26యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట
బహు ధైర్యము పుట్టించును
27అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు.
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపుఊట
అది మరణపాశములలోనుండి విడిపించును
28జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును
జనక్షయము రాజులకు వినాశకరము.
29దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి
ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
30సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము
మత్సరము ఎముకలకు కుళ్లు.
31దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు
బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
32అపాయము రాగా భక్తిహీనుడు నశించును
మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
33తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును
బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును
34నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము
పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
35బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు
అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును
Currently Selected:
సామెతలు 14: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: