కీర్తనలు 115
115
1మాకు కాదు, యెహోవా మాకు కాదు
నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ
కలుగునుగాక
2–వారి దేవుడేడి అని
అన్యజనులెందుకు చెప్పుకొందురు?
3మా దేవుడు ఆకాశమందున్నాడు
తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయు
చున్నాడు
4వారి విగ్రహములు వెండి బంగారువి
అవి మనుష్యుల చేతిపనులు
5వాటికి నోరుండియు పలుకవు
కన్నులుండియు చూడవు
6చెవులుండియు వినవు
ముక్కులుండియు వాసనచూడవు
7చేతులుండియు ముట్టుకొనవు
పాదములుండియు నడువవు
గొంతుకతో మాటలాడవు.
8వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు
వారందరును వాటివంటివారై యున్నారు.
9ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి.
ఆయన వారికి సహాయము వారికి కేడెము
10అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి.
ఆయన వారికి సహాయము వారికి కేడెము
11యెహోవాయందు భయభక్తులుగలవారలారా
యెహోవాయందు నమ్మిక యుంచుడి
ఆయన వారికి సహాయము వారికి కేడెము.
12యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన
మమ్ము నాశీర్వదించును
ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును
అహరోను వంశస్థుల నాశీర్వదించును
13పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును.
14యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
15భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత
మీరు ఆశీర్వదింపబడినవారు.
16ఆకాశములు యెహోవావశము
భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
17మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును
యెహోవాను స్తుతింపరు
18మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను
స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
Currently Selected:
కీర్తనలు 115: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
కీర్తనలు 115
115
1మాకు కాదు, యెహోవా మాకు కాదు
నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ
కలుగునుగాక
2–వారి దేవుడేడి అని
అన్యజనులెందుకు చెప్పుకొందురు?
3మా దేవుడు ఆకాశమందున్నాడు
తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయు
చున్నాడు
4వారి విగ్రహములు వెండి బంగారువి
అవి మనుష్యుల చేతిపనులు
5వాటికి నోరుండియు పలుకవు
కన్నులుండియు చూడవు
6చెవులుండియు వినవు
ముక్కులుండియు వాసనచూడవు
7చేతులుండియు ముట్టుకొనవు
పాదములుండియు నడువవు
గొంతుకతో మాటలాడవు.
8వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు
వారందరును వాటివంటివారై యున్నారు.
9ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి.
ఆయన వారికి సహాయము వారికి కేడెము
10అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి.
ఆయన వారికి సహాయము వారికి కేడెము
11యెహోవాయందు భయభక్తులుగలవారలారా
యెహోవాయందు నమ్మిక యుంచుడి
ఆయన వారికి సహాయము వారికి కేడెము.
12యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన
మమ్ము నాశీర్వదించును
ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును
అహరోను వంశస్థుల నాశీర్వదించును
13పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును.
14యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
15భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత
మీరు ఆశీర్వదింపబడినవారు.
16ఆకాశములు యెహోవావశము
భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
17మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును
యెహోవాను స్తుతింపరు
18మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను
స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
Currently Selected:
:
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.