కీర్తనలు 135
135
1యెహోవాను స్తుతించుడి
యెహోవా నామమును స్తుతించుడి
యెహోవా సేవకులారా,
2యెహోవా మందిరములో
మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు
వారలారా,
యెహోవాను స్తుతించుడి.
3యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి
ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
4యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను
తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు
కొనెను.
5యెహోవా గొప్పవాడనియు
మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు
నేనెరుగుదును.
6ఆకాశమందును భూమియందును
సముద్రములయందును మహాసముద్రములన్నిటి
యందును
ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
7భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే.
వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే
తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
8ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి
చూలులను ఆయన హతముచేసెను.
9ఐగుప్తూ, నీమధ్యను ఫరోయెదుటను అతని ఉద్యో
గస్థుల యెదుటను
ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరి
గించెను.
10అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను
ఆయన హతము చేసినవాడు.
11అమోరీయుల రాజైన సీహోనును, బాషానురాజైన ఓగును
హతము చేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.
12ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను
ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను
అప్పగించెను.
13యెహోవా, నీ నామము నిత్యము నిలుచును
యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము
లుండును.
14యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును
తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
15అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి
అవి మనుష్యుల చేతిపనులు.
16వాటికి నోరుండియు పలుకవు
కన్నులుండియు చూడవు
17చెవులుండియు వినవు
వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు.
18వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు
వారందరును వాటితో సమానులగుదురు.
19ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను
తించుడి
అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను
తించుడి
20లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి
యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహో
వాను సన్నుతించుడి.
21యెరూషలేములో నివసించు యెహోవా
సీయోనులోనుండి సన్నుతింపబడును గాక
యెహోవాను స్తుతించుడి.
Currently Selected:
కీర్తనలు 135: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: