కీర్తనలు 50
50
ఆసాపు కీర్తన.
1దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు
తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు
భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
2పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు
ప్రకాశించుచున్నాడు
3మన దేవుడు వేంచేయుచున్నాడు
ఆయన మౌనముగా నుండడు.
ఆయన ముందర అగ్ని మండుచున్నది
ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
4-5ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
–బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన
నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని
మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.
6దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు.
ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. (సెలా.)
7నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల
కించుడి
ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు
డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను
8నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు
నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.
9నీ యింటనుండి కోడెనైనను
నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.
10అడవిమృగములన్నియు
వేయికొండలమీది పశువులన్నియు నావేగదా
11కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును
పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
12లోకమును దాని పరిపూర్ణతయు నావే.
నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
13వృషభముల మాంసము నేను తిందునా?
పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?
14దేవునికి స్తుతి యాగము చేయుము
మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
15ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము
నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర
చెదవు.
16భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు
–నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని?
నా నిబంధన నీనోట వచించెదవేమి?
17దిద్దుబాటు నీకు అసహ్యముగదా
నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
18నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు
వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
19కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు
నీ నాలుక కపటము కల్పించుచున్నది.
20నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు
చెప్పుచున్నావు
నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
21ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని
అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి
అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను
వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
22దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి
లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
23స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ
పరచుచున్నాడు
నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు
మార్గము సిద్ధపరచుకొనెను.
Currently Selected:
కీర్తనలు 50: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: