కీర్తనలు 55
55
ప్రధానగాయకునికి. తంతివాద్యములమీద పాడదగినది. దావీదు రచించినది. దైవధ్యానము.
1దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము
నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
2-3నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
శత్రువుల శబ్దమునుబట్టియు
దుష్టుల బలాత్కారమునుబట్టియు
నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు
చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు
ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
4నా గుండె నాలో వేదనపడుచున్నది
మరణభయము నాలో పుట్టుచున్నది
5దిగులును వణకును నాకు కలుగుచున్నవి
మహా భయము నన్ను ముంచివేసెను.
6ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల
నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే
7త్వరపడి దూరముగా పారిపోయి
పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని
8అరణ్యములో నివసించియుందునే అను
కొంటిని.
9పట్టణములో బలాత్కార కలహములు జరుగుట
నేను చూచుచున్నాను.
ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము
చేయుము వారి నాలుకలు ఛేదించుము.
10రాత్రింబగళ్లువారు పట్టణపు ప్రాకారములమీద
తిరుగుచున్నారు
పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
11దానిమధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి
వంచనయు కపటమును దాని అంగడి వీధులలో
మానక జరుగుచున్నవి.
12నన్ను దూషించువాడు శత్రువు కాడు
శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును
నామీద మిట్టిపడువాడు నాయందు పగపెట్టినవాడు
కాడు
అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.
13ఈ పనిచేసిన నీవు నా సహకారివి
నా చెలికాడవు నా పరిచయుడవు.
14మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము
ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర
మునకు పోయి యున్నవారము.
15వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక
సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు
గాక
చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము
నందును ఉన్నది
16అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును
యెహోవా నన్ను రక్షించును.
17సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను
ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును
ఆయన నా ప్రార్థన నాలకించును
18నా శత్రువులు అనేకులై యున్నారు
అయినను వారు నామీదికి రాకుండునట్లు
సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును
విమోచించియున్నాడు.
19పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు,
మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర
మిచ్చును.
20తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా
త్కారము చేయుదురు
తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
21వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి
అయితే వారి హృదయములో కలహమున్నది.
వారి మాటలు చమురుకంటె నునుపైనవి
అయితే అవి వరదీసిన కత్తులే.
22నీ భారము యెహోవామీద మోపుము
ఆయనే నిన్ను ఆదుకొనును
నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
23దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు
రక్తాపరాధులును వంచకులును
సగముకాలమైన బ్రదుకరు.
నేనైతే నీయందు నమ్మికయుంచియున్నాను.
Currently Selected:
కీర్తనలు 55: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: