YouVersion Logo
Search Icon

కీర్తనలు 59

59
ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపినవారు ఇంటియొద్ద పొంచియున్నప్పుడు అతడు రచించినది. అనుపదగీతము.
1నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం
పుము.
నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.
2పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము.
రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.
3నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు
యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప
మునుబట్టికాదు
ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.
4నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు
లెత్తి సిద్ధపడుచున్నారు
నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.
5సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రా
యేలు దేవా,
అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము
అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము. (సెలా.)
6సాయంకాలమునవారు మరల వచ్చెదరు
కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.
7వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి
మాటలు వెళ్లగ్రక్కుదురు.వారి పెదవులలో కత్తులున్నవి.
8యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు
అన్యజనులందరిని నీవు అపహసించుదువు.
9నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను
నా ఉన్నతమైన దుర్గము దేవుడే.
10నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను
నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని
దేవుడు నాకు చూపించును.
11వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని
మరచిపోదురేమో.
మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా
చెదరు చేసి అణగగొట్టుము.
12వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప
మునుబట్టియువారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియువారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.
13కోపముచేత వారిని నిర్మూలము చేయుమువారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము
దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని
భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు
చేయుము. (సెలా.)
14సాయంకాలమునవారు మరల వచ్చెదరు
కుక్కవలె మొఱుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు
15తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు
తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.
16నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు
ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు.
నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను
ఉదయమున నీకృపనుగూర్చిఉత్సాహగానము చేసెదను
17దేవుడు నాకు ఎత్తయిన కోటగాను
కృపగల దేవుడుగాను ఉన్నాడు
నా బలమా, నిన్నే కీర్తించెదను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in