YouVersion Logo
Search Icon

కీర్తనలు 85

85
ప్రధానగాయకునికి. కోరహు కుమారుల కీర్తన.
1యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి
యున్నావు
చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు
రప్పించియున్నావు.
2నీ ప్రజల దోషమును పరిహరించియున్నావువారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)
3నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు
నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు
4మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.#85:4 మమ్మును మళ్లించుము.
మా మీదనున్న నీ కోపము చాలించుము.
5ఎల్లకాలము మామీద కోపగించెదవా?
తరతరములు నీ కోపము సాగించెదవా?
6నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు
నీవు మరల మమ్మును బ్రదికింపవా?
7యెహోవా, నీ కృప మాకు కనుపరచుము
నీ రక్షణ మాకు దయచేయుము.
8దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని
బెట్టెదను
ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ
వచనము సెలవిచ్చునువారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.
9మన దేశములో మహిమ నివసించునట్లు
ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
10కృపాసత్యములు కలిసికొనినవి
నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.
11భూమిలోనుండి సత్యము మొలుచును
ఆకాశములోనుండి నీతి పారజూచును.
12యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును
మన భూమి దాని ఫలమునిచ్చును.
13నీతి ఆయనకు ముందు నడచును
ఆయన అడుగుజాడలలో అది నడచును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in