పరమగీతము 6
6
1స్త్రీలలో అధిక సుందరివగుదానా,
నీ ప్రియుడు ఎక్కడికి పోయెను?
అతడేదిక్కునకు తిరిగెను?
మనము పోయి యతని వెదకుదము రమ్ము.
2ఉద్యానవనమునందు మేపుటకును
పద్మములను ఏరుకొనుటకును
నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను
పరిమళ పుష్పస్థానమునకు పోయెను.
3నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను
అతడును నావాడు.
4నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన
దానవు.
యెరూషలేమంత సౌందర్యవంతురాలవు
టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు
దానవు
5నీ కనుదృష్టి నామీద ఉంచకుము
అది నన్ను వశపరచుకొనును
నీ తలవెండ్రుకలు
గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.
6నీ పలువరుస కత్తెర వేయబడినవియు
కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై
జోడుజోడు పిల్లలుకలిగి ఒకదానినైన పోగొట్టు
కొనక
సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి.
7నీ ముసుకుగుండ నీ కణతలు
విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.
8అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను
లును
లెక్కకు మించిన కన్యకలును కలరు.
9నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే
ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె
కన్నతల్లికి ముద్దు బిడ్డ
స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు
రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.
10సంధ్యారాగము చూపట్టుచు
చంద్రబింబమంత అందముగలదై
సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై
వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు
ఈమె ఎవరు?
11లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు
ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో
దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు
నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.
12తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను
నేను కలిసికొంటిని.
13షూలమ్మీతీ, రమ్ము రమ్ము
మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి
రమ్ము.
షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది?
అమె మహనయీము నాటకమంత వింతయైనదా?
Currently Selected:
పరమగీతము 6: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: