కీర్తనల గ్రంథము 135
135
1యెహోవాను స్తుతించండి.
యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
2యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
3యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
4యెహోవా యాకోబును కోరుతున్నాడు.
యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
5యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
6ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
7భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
8ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
9దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.
13యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
19ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
యెహోవా స్తుతించబడును గాక!
యెహోవాను స్తుతించండి!
Currently Selected:
కీర్తనల గ్రంథము 135: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: