YouVersion Logo
Search Icon

1 యోహాను 1

1
శరీరధారి అయిన జీవ వాక్యం
1ఆది నుండి ఉన్న, మేము వినిన, మా కన్నులతో చూసిన, మా చేతులతో తాకిన, ఆ జీవ వాక్యం గురించే మేము ప్రకటిస్తున్నాము. 2ఆ జీవం ప్రత్యక్షమైంది; మేము దానిని చూశాము, దాని గురించి సాక్ష్యమిస్తున్నాము, తండ్రి దగ్గర ఉండిన మాకు ప్రత్యక్షమైన నిత్యజీవం గురించి మీకు ప్రకటిస్తున్నాము. 3తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడ మాతో చేరేలా, మేము చూచిన వాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము. 4మన#1:4 మన కొన్ని ప్రతులలో మీ ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము.
వెలుగు చీకటి, పాపం క్షమాపణ
5మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. 6ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగివున్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే, మనం అబద్ధం చెప్తున్నాము, సత్యంలో జీవించడం లేదు. 7అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము, ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తుంది.
8ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకొంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. 9ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనలను శుద్ధిచేస్తారు. 10మనం పాపం చేయలేదని చెప్పుకొంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.

Currently Selected:

1 యోహాను 1: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in