YouVersion Logo
Search Icon

2 యోహాను 1

1
1పెద్దనైన నేను,
దేవుని చేత ఎన్నుకోబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు వ్రాయునది: సత్యంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే కాదు, సత్యాన్ని ఎరిగిన వారందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2మనలో నివసిస్తున్న, నిత్యం మనతోనే ఉండే సత్యాన్ని బట్టి వారు ప్రేమిస్తున్నారు.
3తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు కృప, కనికరం శాంతి, సత్యం ప్రేమలో మనతో ఉండును గాక.
4తండ్రి మనకు ఆజ్ఞాపించిన విధంగా, నీ బిడ్డలలో కొందరు సత్యంలో జీవించడం చూసి ఎంతో సంతోషించాను. 5ఇప్పుడు, అమ్మా, నేను నీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞయే. మనం ఒకరినొకరం ప్రేమించాలని అడుగుతున్నా. 6ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా, మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన యిచ్చిన ఆజ్ఞ.
7ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మానవ శరీరంతో వచ్చారని ఒప్పుకొనని చాలామంది మోసగాళ్ళు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు మోసగాడు, క్రీస్తు విరోధి. 8మనం#1:8 మనం కొన్ని ప్రతులలో మీరు ఇంతవరకు దేని కొరకు పనిచేసామో దానిని కోల్పోకుండా మీ బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి. 9క్రీస్తు బోధలో కొనసాగకుండా, దానిని దాటి వెళ్ళే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగివుంటారు. 10ఎవరైన ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకువెళ్ళవద్దు లేదా రమ్మనవద్దు. 11వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.
12మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
13దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు.

Currently Selected:

2 యోహాను 1: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in