ఫిలిప్పీ పత్రిక 2
2
క్రీస్తు వినయాన్ని అనుకరించుట
1అయితే మీకు క్రీస్తులో ప్రోత్సాహం గాని, ఆయన ప్రేమ వలన ఆదరణ గాని, ఆత్మలో ఏ సహవాసం గాని, దయ, కనికరం గాని కలిగినచో, 2మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. 3స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ, 4మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.
5మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:
6ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి,
దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;
7కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని
తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని
మనుష్యుని పోలికగా పుట్టారు.
8మనుష్యునిగా కనబడి
మరణానికి విధేయత చూపించడం ద్వారా
అనగా సిలువ మరణం పొందేంతగా
తనను తాను తగ్గించుకున్నారు!
9అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి
అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,
10యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు,
పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,
11ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది,
తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.
నక్షత్రాల్లా ప్రకాశించుట
12కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. 13ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.
14సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. 15-16తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని#2:15-16 ద్వితీ 32:5 దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను. 17మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను. 18కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి.
తిమోతి ఎపఫ్రొదితు
19మీరు ఎలా ఉన్నారో నేను కూడా తెలుసుకుని సంతోషించాలని, ప్రభువైన యేసులో తిమోతిని త్వరలో మీ దగ్గరకు పంపాలని నేను అనుకుంటున్నాను. 20అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు. 21ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు. 22తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు. 23కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను. 24నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.
25నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాలను చూసుకోవడాని మీరు పంపిన మీ దూతయైన ఎపఫ్రొదితును తిరిగి మీ దగ్గరకు పంపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. 26అతడు అనారోగ్యంగా ఉన్నాడని మీరు విన్నారు, కాబట్టి మీ అందరిని చూడాలని ఆశపడుతూ దుఃఖపడుతున్నాడు. 27అతడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు కాని దేవుడు అతన్ని కనికరించారు. అతన్నే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండా నన్ను కూడా కనికరించారు. 28మీరు అతన్ని మరలా చూసినప్పుడు మీరు సంతోషిస్తారు, అలాగే నా వేదన కొంత తగ్గుతుంది, కాబట్టి అతన్ని పంపాలని అందరికంటే నేనే ఎక్కువ ఆశపడుతున్నాను. 29గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. 30ఎందుకంటే క్రీస్తు పని కోసం అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మీరు నాకు చేయలేని సహాయాన్ని చేయడానికి అతడు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు.
Currently Selected:
ఫిలిప్పీ పత్రిక 2: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: