YouVersion Logo
Search Icon

సామెతలు 18

18
1స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు,
అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.
2మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు
కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు.
3దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది,
అవమానముతో నింద వస్తుంది.
4నోటి మాటలు అగాధజలాలు,
కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము.
5తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు,
అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు.
6మూర్ఖుల మాటలు తగాదాకు సిద్ధముగా ఉన్నది,
వారి నోళ్ళు దెబ్బలు ఆహ్వానిస్తాయి.
7మూర్ఖుని నోరు వానికి నాశనము తెచ్చును,
వాని పెదవులు వాని ప్రాణాలకు ఉరి.
8పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి
అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.
9పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు,
వినాశకునికి సోదరుడు.
10యెహోవా నామం బలమైన కోట,
నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.
11ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం;
వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.
12నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది,
ఘనతకు ముందు వినయం ఉంటుంది.
13సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు
తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
14నరుని ఆత్మ వాని రోగాన్ని సహిస్తుంది,
కానీ నలిగిన హృదయాన్ని ఎవరు భరించగలరు?
15వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది,
జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.
16ఒక బహుమతి మార్గం తెరుస్తుంది
అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.
17ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు,
వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది.
18చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది
బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది.
19కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము.
వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి.
20నోటి ఫలం చేత ఒక వ్యక్తి కడుపు నిండుతుంది,
తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తినొందుతాడు.
21చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి,
దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.
22భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది,
వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.
23పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు,
కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు.
24నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు,
కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in