కీర్తనలు 103
103
కీర్తన 103
దావీదు కీర్తన.
1నా ప్రాణమా, యెహోవాను స్తుతించు;
నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
2నా ప్రాణమా, యెహోవాను స్తుతించు,
ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.
3ఆయన నీ పాపాలను క్షమిస్తారు,
నీ రోగాలను స్వస్థపరుస్తారు.
4నరకంలో#103:4 మూ. భా. లో గోతి నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు
నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,
5నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా,
మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు.
6అణగారిన వారికందరికి యెహోవా
నీతిని న్యాయాన్ని జరిగిస్తారు.
7ఆయన మోషేకు తన మార్గాలను,
ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు.
8యెహోవా కృపా కనికరం గలవారు,
త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.
9ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు,
శాశ్వతంగా కోపం పెట్టుకోరు;
10మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు
మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు.
11భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో,
తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం.
12పడమటికి తూర్పు ఎంత దూరమో,
అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.
13తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు,
తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;
14మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు,
మనం మట్టి అని ఆయనకు తెలుసు.
15మానవుల జీవితం గడ్డిలాంటిది,
పొలంలో పువ్వు పూసినట్లు పూస్తారు;
16దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది,
దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు.
17ఆయనకు భయపడేవారి పట్ల
యెహోవా మారని ప్రేమ
వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,
18ఆయన నిబంధనను పాటించేవారిపట్ల,
ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.
19యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు,
ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు.
20యెహోవా దూతలారా,
ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే
బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.
21యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా,
మీరంతా యెహోవాను స్తుతించండి.
22ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి
యెహోవాను స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
Currently Selected:
కీర్తనలు 103: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: