YouVersion Logo
Search Icon

కీర్తనలు 131

131
కీర్తన 131
దావీదు యాత్రకీర్తన.
1యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు,
నా కళ్లు అహంకారం కలిగిలేవు.
నేను గ్రహించలేని గొప్ప విషయాలను
నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.
2పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు,
అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు,
నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.
3ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం
యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in