కీర్తనలు 32
32
కీర్తన 32
దావీదు ధ్యానకీర్తన.
1తమ పాపాలు క్షమించబడినవారు
తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.
2యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు
ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.
3నేను మౌనంగా ఉండి,
రోజంతా మూలుగుతూ ఉన్నందుకు
నా ఎముకలు కృశించాయి.
4రాత్రింబగళ్ళు మీ చేయి నాపై
భారంగా ఉంది;
వేసవిలో నీరు ఎండిపోయినట్లు
నాలో సారం యింకి పోయింది. సెలా
5అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను
నా దోషాన్ని నేను దాచుకోలేదు.
“యెహోవా ఎదుట
నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను.
అప్పుడు నా అతిక్రమాన్ని
మీరు క్షమించారు. సెలా
6మీరు దొరికే సమయంలోనే
నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక;
జలప్రవాహాలు ఉప్పొంగినా
వారిని చేరవు.
7నా దాగుచోటు మీరే;
కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు
విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా
8మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను;
మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.
9వివేచనలేని గుర్రంలా
కంచరగాడిదలా ప్రవర్తించకండి
కళ్లెంతో పగ్గంతో వాటిని అదుపు చేయాలి
లేకపోతే మీరు వాటిని వశపరచుకోలేరు.
10దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి,
కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ
ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.
11నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి.
యథార్థ హృదయులారా, మీరు పాడండి.
Currently Selected:
కీర్తనలు 32: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.