1
యోహాను 13:34-35
తెలుగు సమకాలీన అనువాదము
“ఒక క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను: ఒకరిని ఒకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనే దానిని బట్టి, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకొంటారు” అన్నారు.
Compara
Explorar యోహాను 13:34-35
2
యోహాను 13:14-15
నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ కాళ్ళను కడిగాను, కనుక మీరు కూడ ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీ కొరకు చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను.
Explorar యోహాను 13:14-15
3
యోహాను 13:7
అందుకు యేసు, “నేను చేస్తున్న దానిని ఇప్పుడు మీరు గ్రహించలేరు, కాని తర్వాత గ్రహిస్తారు” అన్నారు.
Explorar యోహాను 13:7
4
యోహాను 13:16
ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకువెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
Explorar యోహాను 13:16
5
యోహాను 13:17
ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కనుక వాటిని పాటిస్తే మీరు ధన్యులు.
Explorar యోహాను 13:17
6
యోహాను 13:4-5
కనుక ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువ్వాలును నడుముకు కట్టుకున్నారు. ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్ళు పోసి, తన శిష్యుల కాళ్ళను కడిగి, తన చుట్టూ కట్టుకొని ఉన్న తువ్వాలుతో వాటిని తుడవడం మొదలుపెట్టారు.
Explorar యోహాను 13:4-5
Inici
La Bíblia
Plans
Vídeos