1
ప్రసంగి 7:9
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కోపించడానికి తొందరపడవద్దు. మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది.
సరిపోల్చండి
Explore ప్రసంగి 7:9
2
ప్రసంగి 7:14
మంచి రోజుల్లో సంతోషంగా గడుపు. చెడ్డ రోజుల్లో దీన్ని ఆలోచించు, తాము గతించి పోయిన తరువాత ఏం జరగబోతుందో తెలియకుండా ఉండడానికి దేవుడు సుఖదుఃఖాలను పక్కపక్కనే ఉంచాడు.
Explore ప్రసంగి 7:14
3
ప్రసంగి 7:8
ఒక పని ప్రారంభం కంటే దాని ముగింపు ప్రాముఖ్యం. అహంకారి కంటే శాంతమూర్తి గొప్పవాడు.
Explore ప్రసంగి 7:8
4
ప్రసంగి 7:20
ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు.
Explore ప్రసంగి 7:20
5
ప్రసంగి 7:12
జ్ఞానం, డబ్బు, ఈ రెండూ భద్రతనిచ్చేవే. అయితే జ్ఞానంతో లాభం ఏమిటంటే తనను కలిగి ఉన్నవారికి అది జీవాన్నిస్తుంది.
Explore ప్రసంగి 7:12
6
ప్రసంగి 7:1
పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు.
Explore ప్రసంగి 7:1
7
ప్రసంగి 7:5
మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు.
Explore ప్రసంగి 7:5
8
ప్రసంగి 7:2
విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖంతో ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు. ఎందుకంటే చావు అందరికీ వస్తుంది కాబట్టి జీవించి ఉన్నవారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి.
Explore ప్రసంగి 7:2
9
ప్రసంగి 7:4
జ్ఞానులు తమ దృష్టిని దుఃఖంలో ఉన్నవారి ఇంటి మీద ఉంచుతారు. అయితే మూర్ఖుల ఆలోచనలన్నీ విందులు చేసుకొనే వారి ఇళ్ళపై ఉంటాయి.
Explore ప్రసంగి 7:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు