1
ప్రసంగి 9:10
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.
సరిపోల్చండి
Explore ప్రసంగి 9:10
2
ప్రసంగి 9:11
నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.
Explore ప్రసంగి 9:11
3
ప్రసంగి 9:9
దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం.
Explore ప్రసంగి 9:9
4
ప్రసంగి 9:7
నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి. సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
Explore ప్రసంగి 9:7
5
ప్రసంగి 9:18
యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.
Explore ప్రసంగి 9:18
6
ప్రసంగి 9:17
మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.
Explore ప్రసంగి 9:17
7
ప్రసంగి 9:5
బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
Explore ప్రసంగి 9:5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు