1
కీర్తన 34:18
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.
సరిపోల్చండి
Explore కీర్తన 34:18
2
కీర్తన 34:4
నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.
Explore కీర్తన 34:4
3
కీర్తన 34:19
ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.
Explore కీర్తన 34:19
4
కీర్తన 34:8
యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.
Explore కీర్తన 34:8
5
కీర్తన 34:5
ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.
Explore కీర్తన 34:5
6
కీర్తన 34:17
ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.
Explore కీర్తన 34:17
7
కీర్తన 34:7
యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.
Explore కీర్తన 34:7
8
కీర్తన 34:14
చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
Explore కీర్తన 34:14
9
కీర్తన 34:13
దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.
Explore కీర్తన 34:13
10
కీర్తన 34:15
యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.
Explore కీర్తన 34:15
11
కీర్తన 34:3
నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.
Explore కీర్తన 34:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు