సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి.
నక్షత్రాలు ప్రకాశించడం మానివేస్తాయి.
యెహోవా దేవుడు సీయోనులోనుండి కేకవేస్తాడు.
యెరూషలేమునుండి ఆయన కేక వేస్తాడు.
మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి.
కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్థానం.
ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.