యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.
ఆమోసు ఇలా చెప్పాడు:
“యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు
యెరూషలేము నుండి ఉరుముతున్నారు;
కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి,
కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”