ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా! ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మ ను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మా నుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా? ఆత్మ ను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు? అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి– నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా– ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా– నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును. ఆత్మ నుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను; ఇందునుగూర్చి– మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
Read గలతీయులకు 3
వినండి గలతీయులకు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: గలతీయులకు 3:1-14
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు