హెబ్రీయులకు 1
1
1పూర్వకాలమందు నానాసమయములలోను#1:1 మూలభాషలో–నానాభాగములుగాను. నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు 2ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను#1:2 మూలభాషలో–యుగములను. నిర్మించెను. 3-4ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును,#1:3-4 లేక, ప్రతిబింబమును. ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. 5ఏలయనగా
–నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక
–నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితో నైన ఎప్పుడైనను చెప్పెనా?
6మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
7-8–తన దూతలను వాయువులుగాను#1:7-8 లేక, ఆత్మలుగాను. తన సేవకులను
అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే
–దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;
నీ రాజదండము న్యాయార్థమయినది.
9నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి
అందుచేత దేవుడు నీతోడివారికంటె
నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
10మరియు
–ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
11ఆకాశములు కూడ నీ చేతిపనులే
అవి నశించును గాని నీవు నిలిచియుందువు
అవన్నియు వస్త్రమువలె పాతగిలును
12ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు
అవి వస్త్రమువలె మార్చబడును గాని
నీవు ఏకరీతిగానే యున్నావు
నీ సంవత్సరములు తరుగవు
13అని చెప్పుచున్నాడు. అయితే
–నేను నీ శత్రువులను నీ పాదములకు
పాదపీఠముగా చేయువరకు
నా కుడిపార్శ్వమున కూర్చుండుము
అని దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా? 14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీయులకు 1: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: