యోబు 12
12
1అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర .
మిచ్చెను–
2నిజముగా లోకములో మీరే జనులు
మీతోనే జ్ఞానము గతించి పోవును.
3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి
యున్నది
నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను
మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు?
దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా
నుండవలసివచ్చెను.
నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పద
ముగా నుండవలసి వచ్చెను.
5దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు.
కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
6దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును
దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా
నుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
7అయినను మృగములను విచారించుము అవి నీకు
బోధించును
ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియ
జేయును.
8భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు బోధించును
సముద్రములోని చేపలును నీకు దాని వివరించును
9వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల
యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొన
లేనివాడెవడు?
10జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును
ఆయన వశమున నున్నవి గదా.
11అంగిలి ఆహారమును రుచి చూచునట్లు
చెవి మాటలను పరీక్షింపదా?
12వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన
కలుగుచున్నది అని మీరు చెప్పుదురు
13జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి
ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.
14ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరల
కట్టజాలరు
ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట
ఎవరికిని సాధ్యము కాదు.
15ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి
ఆరిపోవును
వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచి
వేయును.
16బలమును జ్ఞానమును ఆయనకు
స్వభావలక్షణములు
మోసపడువారును మోసపుచ్చువారును ఆయన
వశముననున్నారు.
17ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని
తోడుకొని పోవును.
న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
18రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.
19యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొనిపోవును
స్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.
20వాక్చాతుర్యముగలవారి పలుకును ఆయన నిరర్థకము
చేయును
పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
21అధిపతులను ఆయన తిరస్కారము చేయును
బలాఢ్యుల నడికట్లను విప్పును.
22చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు
మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
23జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును
సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.
24భూజనుల అధిపతుల వివేచనను ఆయన
నిరర్థక పరచును
త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ
చేయును.
25వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు
మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూల
చేయును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 12: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: