కీర్తనలు 65
65
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. గీతము.
1దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి
చెల్లించుటే#65:1 పాఠాంతరము–స్తుతి నీకు తగియున్నది.
నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.
2ప్రార్థన ఆలకించువాడా,
సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు
3నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి
మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము
చేయుదువు.
4నీ ఆవరణములలో నివసించునట్లు
నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు
నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత
మేము తృప్తిపొందెదము.
5మాకు రక్షణకర్తవైన దేవా,
భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము
మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా,
నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు
చున్నావు
6బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై
తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే
7ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల
ఘోషను అణచువాడు
జనముల అల్లరిని చల్లార్చువాడు.
8నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును
భయపడుదురు
ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష
భరితములుగా చేయుచున్నావు.
9నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు
దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు
దేవుని నది నీళ్లతో నిండియున్నది
నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాతవారి ధాన్యము దయచేయుచున్నావు.
10దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి
దాని గనిమలను చదును చేయుచున్నావు.
వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు
అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.
11సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు
నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.
12అడవి బీడులు సారము చిలకరించుచున్నవి
కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని
యున్నవి.
13పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి.
లోయలు సస్యములతో కప్పబడియున్నవి
అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు
గానముచేయుచున్నవి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 65: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: