కీర్తనలు 68
68
ప్రధానగాయకునికి. దావీదు రచించినది. గీతము.
1దేవుడు లేచును గాక
ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక
ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి
పోవుదురు గాక.
2పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము
అగ్నికిమైనము కరుగునట్లు
భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
3నీతిమంతులు సంతోషించుదురు గాకవారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాకవారు మహదానందము పొందుదురు గాక
4దేవునిగూర్చిపాడుడి ఆయన నామమునుబట్టి స్తోత్ర
గానము చేయుడి
వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణముచేయు
దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి
యెహోవా అను ఆయన నామమునుబట్టి ఆయన
సన్నిధిని ప్రహర్షించుడి.
5తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారి తండ్రియు
విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
6దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు.
ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల
జేయువాడు
విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.
7దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు
అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా.)
8భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ
జారెను
ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను.
9దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా
కురిపించితివి
అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
10నీ సమూహము దానిలో నివసించును
దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము
కలుగజేసితివి.
11ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు
దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా
ఉన్నారు.
12సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు
ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
13గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా
గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది
వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప
బడినట్టున్నది.
14సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు
సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.
15బాషాను పర్వతము దేవపర్వతము
బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.
16శిఖరములుగల పర్వతములారా,
దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల
ఓరచూపులు చూచుచున్నారు?
యెహోవా నిత్యము అందులోనే నివసించును.
17దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు
ప్రభువు వాటిలో నున్నాడు
సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
18నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని
పోతివి
మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు.
యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు
విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి
కొని యున్నావు.
19ప్రభువు స్తుతినొందును గాక
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు
దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.
20దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు
దేవుడై యున్నాడు
మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
21దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల
గొట్టును.
మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి
నెత్తిని ఆయన పగులగొట్టును.
22ప్రభువు సెలవిచ్చినదేమనగా–నేను బాషానులోనుండి
వారిని రప్పించెదను
అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.
23వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు
నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
24దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు
నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు.
చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా
25కీర్తనలు పాడువారు ముందర నడచిరి.
తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
26సమాజములలో దేవుని స్తుతించుడి
ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు
వును స్తుతించుడి.
27కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట
నున్నాడు.
యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది
జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును
ఉన్నారు.
28నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు.
దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము
29యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి
రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.
30రెల్లులోని మృగమును
ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి,
వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము
కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.
31ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు
కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని
పరుగెత్తివచ్చెదరు.
32భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి
ప్రభువును కీర్తించుడి. (సెలా.)
33అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని
కీర్తించుడి
ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన
స్వరము.
34దేవునికి బలాతిశయము నారోపించుడి
మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు
చున్నాడు
అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది
35తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు
ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ
ముల ననుగ్రహించుచున్నాడు
దేవుడు స్తుతినొందును గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 68: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: