నెహెమ్యా 7
7
1ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము. 2అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకు అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు. 3అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”
తిరిగి వచ్చిన బందీల జాబితా
4అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసినంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు. 5జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.
6చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత పట్టణానికి పోయాడు. 7ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు#7:7 జెరుబ్బాబెలు జెరుబ్బాబెలుని షేష్‌బజ్జరు అని కూడా అంటారు. తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
8పరోషు వంశీయులు | 2,172 |
9షెపట్యా వంశీయులు | 372 |
10ఆరహు వంశీయులు | 652 |
11పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు వంశపు వాళ్లు) | 2,818 |
12ఏలాము వంశీయులు | 1,254 |
13జత్తూ వంశీయులు | 845 |
14జక్కయి వంశీయులు | 760 |
15బిన్నూయి వంశీయులు | 648 |
16బేబై వంశీయులు | 628 |
17అజ్గాదు వంశీయులు | 2,322 |
18అదోనీకాము వంశీయులు | 667 |
19బిగ్వయి వంశీయులు | 2,067 |
20ఆదీను వంశీయులు | 655 |
21హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు | 98 |
22హాషూము వంశీయులు | 328 |
23బేజయి వంశీయులు | 324 |
24హారీపు వంశీయులు | 112 |
25గిబియోను వంశీయులు | 95 |
26బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు | 188 |
27అనాతోతు పట్టణం వాళ్లు | 128 |
28బేతజ్మావెతు పట్టణం వాళ్లు | 42 |
29కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్టణాల వాళ్లు | 743 |
30రమా, గెబ పట్టణాల వాళ్లు | 621 |
31మిక్మషు పట్టణం వాళ్లు | 122 |
32బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు | 123 |
33రెండవ నెబో పట్టణం వాళ్లు | 52 |
34రెండవ ఏలాము పట్టణం వాళ్లు | 1,254 |
35హారిము పట్టణం వాళ్లు | 320 |
36యెరికో పట్టణం వాళ్లు | 345 |
37లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు | 721 |
38సెనాయా పట్టణం వాళ్లు | 3,930 |
39వీళ్లు యాజకులు:
యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు | 973 |
40ఇమ్మేరు వంశీయులు | 1,052 |
41పషూరు వంశీయులు | 1,247 |
42హారిము వంశీయులు | 1,017 |
43లేవీ వంశానికి చెందిన వాళ్లు:
యేషువా, హోదేయా,#7:43 హోదేయా లేక హోదద్యా.కద్మీయులు | 74 |
44వీళ్లు గాయకులు:
ఆసావు వంశీయులు | 148 |
45వీళ్లు ద్వారపాలకులు:
షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు | 138 |
46వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు:
జీహా, హశూఫా, టబ్బాయేలు
47కేరోసు, సీయహా, పాదోను,
48లెబానా, హగాబా, షల్మయి,
49హానాను, గిద్దేలు, గహరు
50రెవాయ, రెజీను, నెకోదా,
51గజ్జాము, ఉజ్జా, పాసెయ.
52బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
53బక్బూకు, హకూఫా, హర్హూరు,
54బజ్లీతు, మెహీదా, హర్షా,
55బర్కోసు, సీసెరా, తెమాహా,
56నెజీయహు, హటేపా.
57సొలొమోను దాసుల వంశాలకు చెందిన వారు:
సొటయి, సోపెరెతు, పెరూదా,
58యహలా, దర్కొను, గిద్దేలు,
59షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
60ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం | 392 |
61కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
62దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు | 642 |
63యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు
హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా పరిగణింపబడ్డారు.)
64వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చబడలేదు. 65అత్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము#7:65 ఊరీము, తుమ్మీము తీర్పు సంచిలో వుంచే ప్రత్యేకమైన రాళ్లు. ప్రధాన యాజకుడు ఈ రాళ్లను చేత పట్టుకొని దేవుని నుంచి సమాధానాన్ని అర్థిస్తాడు. ఉపయోగించి, దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి, ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
66-67మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 68-69వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి.
70కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు. 71కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనుల బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు. 72మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము, 1 1/3 టన్నుల వెండిని, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.
73ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమ తమ స్వంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ స్వంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల#7:73 ఏడవ నెల ఏడవనెల అనగా సెప్టెంబరు, అక్టోబరు. నాటికి ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నెహెమ్యా 7: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: