కీర్తనల గ్రంథము 101
101
దావీదు కీర్తన.
1ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
2నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
3నా యెదుట ఏ విగ్రహాలు#101:3 విగ్రహాలు అక్షరార్థముగా భయంకర సంగతులు. ఉంచుకోను.
అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
నేను అలా చేయను!
4నేను నిజాయితీగా ఉంటాను.
నేను దుర్మార్గపు పనులు చేయను.
5ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
అతిశయించడం నేను జరుగనివ్వను.
6నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
7అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
8ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనల గ్రంథము 101: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International