కీర్తనల గ్రంథము 102
102
శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది.
1యెహోవా, నా ప్రార్థన విను.
సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
2యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము.
నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
3పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది.
నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది.
4నా బలం పోయింది.
నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
5నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.#102:5 నా బరువు తగ్గిపోతూంది అక్షరార్థంగా నా ఎముకలు నా చర్మానికి అంటుకుపోతవి.
6అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
శిథిలమైన పాత కట్టడాలలో బ్రతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
7నేను నిద్రపోలేను.
పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను.
8నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు.
నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
9నా అధిక విచారమే నా భోజనం.
నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి.
10ఎందుకంటే, నీవు నా మీద కోపగించావు.
యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను క్రిందకు విసిరేశావు.
11సాయంకాలమయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయిపోయింది.
నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను.
12అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
13నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.
నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది.
14యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
15జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.
దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
16ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.
యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
17దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.
దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
18రాబోయే తరంవారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసిపెట్టు.
అప్పుడు, భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
19యెహోవా పైనున్న తన పవిత్ర స్థానం నుండి క్రిందకు చూస్తాడు.
యెహోవా పరలోకం నుండి క్రింద భూమిని చూస్తాడు.
20ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు.
మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు.
21సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబుతారు.
వారు యెహోవా నామాన్ని యెరూషలేములో స్మరిస్తారు.
22జనసమూహములు కలిసి పోగుచేయబడునప్పుడు
రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.
23నాలో బలం పోయింది.
నా జీవితం తక్కువగా చేయబడింది.
24కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు.
దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
25చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు.
ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు.
26ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి.
కాని నీవు శాశ్వతంగా జీవిస్తావు.
అవి బట్టల్లా పాడైపోతాయి.
మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చివేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
27కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు.
నీవు శాశ్వతంగా జీవిస్తావు!
28ఈ వేళ మేము నీ సేవకులము.
భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు.
మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనల గ్రంథము 102: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: