పరమ గీతము 1

1
1సొలొమోను గీతాలలో ఉన్నత గీతం
వరునితో వధువు
2తన నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొననిమ్ము
ఎందుకంటే ద్రాక్షా రసంకన్నా మధురమయింది నీ ప్రేమ.
3నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది,
కాని మిక్కిలి ఉత్తమ పరిమళ ద్రవ్యం కన్నా నీ పేరు#1:3 పేరు హీబ్రూభాషలో ఈ మాట “పరిమళం” లా ధ్వనిస్తుంది. తియ్యనైనది.
అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
4నన్ను ఆకర్షించుకొనుము!
మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాము!
రాజు తన రాజ గృహానికి నన్ను తీసుకు వెళ్ళాడు.
యెరూషలేము స్త్రీలు వరునితో
మేము ఆనందిస్తాం. నీకోసం సంతోషంగా ఉంటాం.
నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుందని జ్ఞాపకముంచుకొనుము.
మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
వధువు స్త్రీలతో అంటుంది
5యెరూషలేము పుత్రికలారా,
కేదారు, సల్మా#1:5 కేదారు, సల్మా అరేబియా జాతులు. “సల్మా” కు హీబ్రూలో “సొలొమోను” అని ఉందికాని సల్మా, “సల్మాను” పదాలను రూతు 4:20-21 తో పోల్చిచూడండి. గుడారాలంత నల్లగా ఉన్నాను. గుడారముల నలుపువలె
నేను నల్లగా అందంగా ఉన్నాను.
6నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు,
సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు.
నా సోదరులు నా మీద కోపగించారు.
వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు.
అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను.#1:6 అందువల్ల … తీసుకోలేకపోయాను శబ్ధార్థ ప్రకారం “నా సొంత ద్రాక్ష తోట.”
ఆమె అతనితో అంటుంది
7నా ప్రాణం అంతటితో నిన్ను ప్రేమిస్తాను!
నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో,
మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు.
నీతో ఉండటానికి నేను రావాలి లేకపోతే నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీని#1:7 అద్దెకు … స్త్రీ లేదా, “ముసుగు వేసుకున్న స్త్రీలు.” వ్యభిచారిణి అనే అర్థం కూడా ఇవ్వవచ్చును. అవుతాను!
అతను ఆమెతో అంటున్నాడు
8నీవు అంత అందమైనదానవు! కనుక
నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో.
వెళ్లు, గొర్రెలను వెంబడించు.
నీ చిన్న మేకల్ని కాపరుల గుడారాల వద్ద మేపు.
9నా ప్రియురాలా, ఫరో రథాలు#1:9 ఫరోరథాలు శబ్దార్థం ప్రకారం “ఓ ప్రియురాలా! నిన్ను ఫరో రథాలలోని ఆడ గుర్రంతో పోలుస్తున్నాను.” లాగుతున్న నా ఆడ గుర్రాలతో నిన్నుపోల్చియున్నాను.
10-11నీకోసం చేసిన అలంకరణలివిగో,
బంగారు తలకట్టు#1:10-11 బంగారు తలకట్టు ఈ హీబ్రూ పదానికి సరియైన అర్థం తెలియడం లేదు. బహుశః అది బుగ్గలమీద వ్రేలాడే అలంకరణలతో కూడిన తలకట్టు కావచ్చు., వెండి గొలుసు.
నీ చెక్కిళ్లు ఎంతో అందంగా ఉన్నాయి
బంగారు అలంకరణలతో,
నీ మెడ ఎంతో అందంగా ఉంది వెండి అల్లికలతో.
ఆమె అంటుంది
12నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరింది.
13నా స్తనాల మధ్య పడివున్న
నా మెడలో వున్న చిన్న గోపరసం#1:13 చిన్న గోపరసం కొన్ని మొక్కల జిగురు నుండి చేయబడిన ఒక పరిమళ ద్రవ్యం. సంచిలాంటి వాడు నా ప్రియుడు.
14ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు#1:14 గోరంటు తియ్యటి వాసన వచ్చే ఒక మొక్క. దానికి ద్రాక్షావల్లిలా గుత్తులు గుత్తులుగా పూచే నీలి పసుపు కర్పూర పూలు ఉంటాయి. పూల
గుత్తిలాంటివాడు నా ప్రియుడు.
అతడు అంటున్నాడు
15నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు!
నీ కళ్లు పావురపు కళ్లలా వున్నాయి.
ఆమె అంటుంది
16నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు!
అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు!
మన శయ్య ఆకుపచ్చగా ఆహ్లాదంగా ఉంది#1:16 మనశయ్య … ఉంది లేదా “నవనవలాడుతూ పచ్చగా” కొత్త పచ్చిక బీడులా ఉంది.
17మన యింటి దూలాలు దేవదారువి
అడ్డకర్రలు సరళమ్రానువి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

పరమ గీతము 1: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి