యోబు 26
26
యోబు
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2“శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు!
బలహీనమైన చేతిని నీవు రక్షించావా?
3జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు?
ఎంత చక్కగా వివరించావు?
4ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు?
ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి?
5“జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు,
మృతులు వణుకుతున్నారు.
6పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది;
నరకం#26:6 హెబ్రీలో అబద్దోను ఆయనకు తేటగా కనిపిస్తుంది.
7శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు;
శూన్యంలో భూమిని వేలాడదీసారు.
8ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు
అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.
9దాని మీద మేఘాలను వ్యాపింపజేసి
ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.
10వెలుగు చీకట్ల సరిహద్దు వరకు
జలాలకు ఆయన హద్దును నియమించారు.
11ఆయన గద్దింపుకు
ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.
12ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది;
తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.
13ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి;
ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.
14ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే;
మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే!
అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 26: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.