యోబు 27
27
యోబు తన స్నేహితులకు చెప్పిన చివరి మాటలు
1యోబు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు:
2“నాకు న్యాయం నిరాకరించిన సజీవుడైన దేవుని మీద,
నా జీవితాన్ని చేదుగా మార్చిన సర్వశక్తిమంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను,
3నాలో ప్రాణం ఉన్నంత వరకు,
నా నాసికా రంధ్రాల్లో దేవుని ఊపిరి ఉన్నంత వరకు,
4నా పెదవులు చెడుదేది మాట్లాడవు,
నా నాలుక అబద్ధాలు పలకదు.
5మీరు చెప్పేది సరియైనదంటే నేనొప్పుకోను;
నేను చనిపోయే వరకు, నా నిజాయితీని విడిచిపెట్టను.
6నేను నా నిర్దోషత్వాన్ని కొనసాగిస్తాను దానిని ఎప్పటికీ వదలను;
నేను బ్రతికిన కాలమంతా నా మనస్సాక్షి నన్ను నిందించదు.
7“నా శత్రువు దుష్టునిలా,
నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక!
8భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత,
దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది?
9వారి మీదికి ఆపద వచ్చినప్పుడు
దేవుడు వారి మొర ఆలకిస్తారా?
10సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా?
అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా?
11“దేవుని శక్తిని గురించి నేను మీకు ఉపదేశిస్తాను;
సర్వశక్తిమంతుని మార్గాలను నేను దాచిపెట్టను.
12మీరే దానిని చూశారు.
అలాంటప్పుడు ఈ అర్థంలేని సంభాషణ ఎందుకు?
13“దుష్టులైన మనుష్యులకు దేవుడు ఇచ్చే భాగం;
సర్వశక్తుని నుండి వారు పొందే వారసత్వం:
14వారికి ఎంతమంది పిల్లలున్నా, ఖడ్గం వారి గతి;
వారి సంతతికి కడుపునిండా తిండి దొరకదు.
15వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు,
వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు.
16దుమ్ము పోగుచేసినట్లు వెండిని పోగుచేసినా
మట్టివలె బట్టలను కుప్పగా వేసినా
17వారు పోగుచేసిన వాటిని నీతిమంతులు ధరిస్తారు,
నిర్దోషులు వారి వెండిని పంచుకుంటారు.
18వారు కట్టుకునే ఇల్లు పురుగుల గూడులా,
కావలివారు వేసుకునే గుడిసెలా ఉంటాయి.
19వారు ధనవంతులుగా పడుకుంటారు,
కాని వారు మేల్కొన్నప్పుడు వారి సంపద అంతా పోయిందని వారు కనుగొంటారు.
20భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది;
తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.
21తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు;
అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.
22వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు
అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.
23అది ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతుంది
వారి స్థలం నుండి వారిని ఊదివేస్తుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 27: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.