ఆమోసు 1
1
1యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు#1:1 హెబ్రీలో యోవాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.
2ఆమోసు ఇలా చెప్పాడు:
“యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు
యెరూషలేము నుండి ఉరుముతున్నారు;
కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి,
కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”
ఇశ్రాయేలు పొరుగువారికి తీర్పు
3యెహోవా ఇలా చెప్తున్నారు:
“దమస్కు చేసిన మూడు పాపాల గురించి,
దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను.
ఎందుకంటే అది గిలాదును
ఇనుప పనిముట్లతో నూర్చింది.
4నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను,
అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది.
5దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను;
ఆవెను#1:5 ఆవెను అంటే దుష్టత్వం లోయలో ఉన్న రాజును#1:5 లేదా నివాసులను నాశనం చేస్తాను
అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు.
అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు”
అని యెహోవా చెప్తున్నారు.
6యెహోవా ఇలా చెప్తున్నారు:
“గాజా చేసిన మూడు పాపాల గురించి,
నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను.
ఎందుకంటే అది సమాజమంతటిని బందీలుగా తీసుకెళ్లి
ఎదోముకు అమ్మివేసింది.
7నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను,
అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.
8నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను,
అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు.
నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు,
నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను”
అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.
9యెహోవా ఇలా చెప్తున్నారు:
“తూరు చేసిన మూడు పాపాల గురించి,
దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను.
ఎందుకంటే సహోదర ఒప్పందాన్ని పరిగణించకుండా,
అది సమాజమంతటిని బందీలుగా ఎదోముకు అమ్మివేసింది.
10నేను తూరు ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను,
అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.”
11యెహోవా చెప్పే మాట ఇదే:
“ఎదోము చేసిన మూడు పాపాల గురించి,
అతని నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను.
ఎందుకంటే అతడు తన సోదరున్ని ఖడ్గంతో వెంటాడాడు,
ఆ దేశ స్త్రీలను చంపేశాడు,
అతని కోపం అధికమవుతూ ఉంది,
ఎప్పుడూ రగులుతూ ఉంది.
12నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను,
అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.”
13యెహోవా ఇలా చెప్తున్నారు:
“అమ్మోను చేసిన మూడు పాపాల గురించి,
అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను.
ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి,
గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.
14నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను,
యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో,
తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు,
అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది.
15దాని రాజు, తన రాజ పరివారంతో పాటు
బందీగా వెళ్తాడు”
అని యెహోవా చెప్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆమోసు 1: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: