నిర్గమ 2

2
మోషే జననం
1ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, 2ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కన్నది. అతడు చక్కగా ఉండడం చూసి, ఆమె వానిని మూడు నెలలు దాచిపెట్టింది. 3కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది. 4అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది.
5ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి రాగా ఆమె పనికత్తెలు నది ఒడ్డున నడుస్తున్నారు. ఆమె జమ్ము మధ్యలో ఉన్న పెట్టెను చూసి దానిని తీసుకురావడానికి తన దాసిని పంపించింది. 6దానిని తెరిచి ఆ పిల్లవాన్ని చూసింది. ఆ పిల్లవాడు ఏడ్వడం చూసిన ఆమె అతనిపై కనికరపడి, “వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అన్నది.
7అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, “ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?” అని అడిగింది.
8అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది. 9ఫరో కుమార్తె ఆమెతో, “నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను” అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది. 10పిల్లవాడు పెద్దయ్యాక, ఆమె అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకెళ్లింది, అతడు ఆమె కుమారుడయ్యాడు. “నేను అతన్ని నీటి నుండి బయటకు తీశాను” అని ఆమె అతనికి మోషే#2:10 మోషే హెబ్రీ పదంలా ఉంది బయటకు తీసిన అని పేరు పెట్టింది.
మోషే మిద్యానుకు పారిపోవడం
11కొన్ని సంవత్సరాల తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత ఒక రోజు అతడు తన సొంత ప్రజలు ఉన్న చోటికి వెళ్లి వారి దుస్థితిని చూశాడు. అప్పుడు అతడు తన సొంత ప్రజల్లో ఒకడైన ఒక హెబ్రీయున్ని ఒక ఈజిప్టువాడు కొట్టడం చూశాడు. 12మోషే అటు ఇటు తిరిగి ఎవరూ లేకపోవడం చూసి ఆ ఈజిప్టువాన్ని చంపి ఇసుకలో దాచిపెట్టాడు. 13మరునాడు అతడు బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతడు వారిలో తప్పు చేసినవానితో, “నీ తోటి హెబ్రీయున్ని ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.
14అందుకు అతడు, “మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?” అన్నాడు. అప్పుడు మోషే, “నేను చేసిన పని అందరికి తెలిసిపోయింది” అని అనుకుని భయపడ్డాడు.
15ఫరో ఈ సంగతి విన్నప్పుడు, అతడు మోషేను చంపడానికి ప్రయత్నించాడు, కాని మోషే ఫరో దగ్గరనుండి పారిపోయి మిద్యానులో జీవించడానికి వెళ్లాడు, అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. 16మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు, వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు తోడి తొట్టెలు నింపడం మొదలుపెట్టారు. 17కొంతమంది గొర్రెల కాపరులు వచ్చి వారిని తరిమివేశారు, అయితే మోషే లేచి వారిని రక్షించి వారి మందకు నీళ్లు పెట్టాడు.
18వారు తమ తండ్రియైన రెయూయేలు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు అతడు, “ఈ రోజు మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు?” అని వారిని అడిగాడు.
19అందుకు వారు, “ఒక ఈజిప్టువాడు మమ్మల్ని గొర్రెల కాపరుల బారి నుండి కాపాడాడు. అంతేకాక మాకు, మందకు నీళ్లు తోడి పెట్టాడు” అని చెప్పారు.
20అందుకు రగూయేలు, “అయితే, అతడు ఎక్కడున్నాడు? అతన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని భోజనానికి పిలుచుకొని రండి” అని తన కుమార్తెలతో అన్నాడు.
21మోషే ఆ వ్యక్తితో ఉండడానికి అంగీకరించాడు. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషేకిచ్చి పెళ్ళి చేశాడు. 22సిప్పోరా ఒక కుమారుని కన్నది, మోషే, “నేను పరాయి దేశంలో పరదేశినయ్యాను” అని అతనికి గెర్షోము#2:22 గెర్షోము హెబ్రీ పదంలా ఉంది అక్కడ పరదేశిగా అని పేరు పెట్టాడు.
23కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది. 24దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు. 25దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమ 2: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి