హోషేయ 8
8
ఇశ్రాయేలు సుడిగాలిని కోస్తారు
1“బూర నీ పెదవులపై పెట్టుకో!
ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది.
ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి,
నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు.
2ఇశ్రాయేలు, ‘మా దేవా!
మిమ్మల్ని మేము తెలుసుకున్నాం’ అని మొరపెడుతుంది.
3కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు;
కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.
4వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు,
వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు.
వారి వెండి బంగారాలతో
తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు.
అవి వారి సొంత నాశనానికే.
5సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి!
నా కోపం వాటి మీద రగులుకుంది
ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?
6ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి!
ఈ దూడను కంసాలి తయారుచేశాడు.
అది దేవుడు కాదు,
ఆ సమరయ దూడ
ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.
7“వారు గాలిని విత్తుతారు,
సుడిగాలిని కోస్తారు.
పైరుకు కంకులు లేవు,
దాని నుండి పిండి రాదు.
అది ఒకవేళ పంటకు వస్తే,
విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.
8ఇశ్రాయేలు మ్రింగివేయబడింది;
ఇప్పుడు అది ఎవరికీ ఇష్టం లేనిదానిగా,
ఇతర దేశాల మధ్య ఉంది.
9వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా,
అష్షూరుకు వెళ్లారు,
ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది.
10వారు తమను ఇతర దేశాల్లో అమ్ముకున్నప్పటికీ,
నేను వారిని ఇప్పుడు సమకూరుస్తాను.
బలవంతుడైన రాజు పెట్టే భారం క్రింద,
వారు నీరసించిపోతారు.
11“పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది,
కాని అవే పాపం చేయడానికి కారణమయ్యాయి.
12నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను,
కాని అవి తమకు సంబంధించినవి కావన్నట్లు పరిగణించారు.
13వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా,
వాటి మాంసం తిన్నా సరే,
యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు.
ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని,
వారి పాపాలను శిక్షిస్తారు:
వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.
14ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి
రాజభవనాలను కట్టుకున్నారు;
యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు.
అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను,
అది వాటి కోటలను దహించి వేస్తుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 8: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: